UPDATES  

 ప్రపంచంలో వినియోగమయ్యే బెల్లంలో 70 శాతం ఇండియా నుంచే ఉత్పత్తి

ఇంగ్లిష్‌లో ‘జాగెరీ’గా, హిందీలో ‘గుడ్‌’గా పిలుచుకునే బెల్లంలో చక్కెర కంటే సుక్రోజ్ తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇది కూడా చక్కెరతో సమానమే. చక్కెరను పరిమితంగా వాడే వారు దీనిని కూడా అదేస్థాయిలో వాడుకోవడం మేలు. చక్కెరలో 99.7 శాతం సుక్రోజ్ ఉంటే బెల్లంలో 70 శాతం ఉంటుంది. అయితే ప్రపంచంలో వినియోగమయ్యే బెల్లంలో 70 శాతం ఇండియా నుంచే ఉత్పత్తి అవుతుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. బెల్లంలో విటమిన్ బీ12, బీ6, ఫోలేట్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల బెల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్ ఇలా.. పై పట్టిక ద్వారా బెల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్ చూశారు కదా.. ఉత్తర భారత దేశంలో చలికాలంలో బెల్లాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. భోజనం ముగిసిన వెంటనే బెల్లం కూడా తింటారు. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయని, అలాగే శరీర ఉష్ణోగ్రతలు పడిపోకుండా ఉంటాయని చెబుతారు. బెల్లాన్ని ఘన పదార్తాలు, ద్రవ పదార్థాలతో బెల్లం మిక్స్ చేసి తినొచ్చు. లేదా పిండి వంటల్లో వినియోగించవచ్చు.

నువ్వులు, పల్లీలు వంటివి పొడి చేసుకుని బెల్లం పొడితో మిక్స్ చేసుకుని తినడాన్ని పిల్లలు చాలా ఇష్టపడతారు. బెల్లంలో ఉండే మెగ్నీషియం మన శరీరంలో నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే ఇందులో ఉండే పుష్కలమైన ఐరన్ కంటెంట్ రక్తహీనత బారి నుంచి కాపాడుతుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా బెల్లం పెంచుతుంది. డయాబెటిస్‌ను, హైపర్‌టెన్షన్‌ను కూడా నిరోధిస్తుందని చెబుతారు. కానీ దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. జీర్ణ క్రియ మెరుగుపడడానికి బెల్లం దోహదపడుతుంది. అలాగే కాలేయం (లివర్), రక్తం శుద్ధి చేసేందుకు బెల్లం ఉపయోగపడుతుంది. మీ ఉపిరితిత్తుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్లను, ముఖ్యంగా బ్రాంకైటల్ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది. బెల్లం మలబద్ధకం సమస్యకు పరిష్కారం చూపుతుంది. మీలో శక్తిని నింపుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రుతుచక్రానికి ముందు పడే బాధల నుంచి విముక్తినిస్తుంది. బెల్లంలో పొటాషియం ఉన్నందున ఇది ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేసి మెటబాలిజం మెరుగుపరుస్తుంది. అలాగే కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. బెల్లంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. నగరీకరణ పెరిగిన కొద్దీ వాతావరణం కలుషితమవుతోంది. కాలుష్య ప్రభావాలను ఈ బెల్లం తగ్గిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో పొల్యూషన్ కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఇది తగ్గిస్తుంది. అయితే బెల్లం వల్ల కొన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కూడా చక్కెరలాంటిదే అయినందున అధిక వినియోగం కారణంగా గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వాటికి కారణమవుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !