UPDATES  

 వైసీపీ ఫాన్స్ కి అలీ షాకింగ్ కౌంటర్

కమెడియన్ గా హీరో గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టు గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దశాబ్దాల నుండి కొనసాగుతున్న నటుడు అలీ ఇటీవలే తన పెద్ద కూతురు ఫాతిమా పెళ్లిని హైదరాబాద్ లో అతిరధ మహారథుల సమక్ష్యంలో ఘనంగా జరిపించిన సంగతి తెలిసిందే..ఈ వివాహ మహోత్సవానికి సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వారితో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. Pawan Kalyan- Ali కానీ అలీ కి ఎంతో ఆప్త మిత్రుడైన పవన్ కళ్యాణ్ మాత్రం పెళ్ళికి హాజరుకాకపోవడం పై సోషల్ మీడియా లో వైసీపీ పార్టీ ఫ్యాన్స్ నుండి తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి..అలీ నీకు ఎంతో మంచి స్నేహితుడు..కేవలం రాజకీయ పరంగా నీతో లేడని అతని కూతురు పెళ్లికి కూడా హాజరు కావా..ఇదెక్కడి స్నేహం అంటూ పవన్ కళ్యాణ్ ని తిట్టడం ప్రారంభించారు..అయితే అలా విమర్శలు చేస్తున్న వైసీపీ ఫ్యాన్స్ నోర్లు మూయించేలా అలీ చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఒక టీవీ రిపోర్టర్ మీ అమ్మాయి పెళ్ళికి పవన్ కళ్యాణ్ గారు రాలేదా అని అడిగారు..అప్పుడు అలీ దానికి సమాధానం చెప్తూ ‘పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది..కానీ ఆయన అదే రోజు వేరే ప్రాంతం లో రాజకీయ పర్యటనలో ఉండడం..ఫ్లైట్ మిస్ అవ్వడం తో పెళ్ళికి హాజరుకాలేక పొయ్యారు..లేకపోతే వచ్చేవాడు..అతని సెక్యూరిటీ కూడా ఇక్కడికి వచ్చి కళ్యాణ్ గారు రావడానికి గల ఏర్పాట్లు చెయ్యడానికి ప్రయత్నం చేసారు..కానీ కుదర్లేదు..ఆ తర్వాత కళ్యాణ్ గారు ఫోన్ చేసి క్షమించండి రాలేకపోతున్నాను..అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉన్నరోజున ఒకసారి నన్ను పిలవండి..ఇంటికి వస్తానని చెప్పారు’ అంటూ అలీ సమాధానం ఇచ్చారు. Pawan Kalyan- Ali దీనితో దీనిని సాకుగా తీసుకొని సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ పై విష ప్రచారాలను చెయ్యాలని చూసిన వైసీపీ పార్టీ ఫ్యాన్స్ కి ఎదురు దెబ్బ తగిలింది..పవన్ కళ్యాణ్ శత్రువు మంచి కూడా కోరుకునే వ్యక్తి అని..మీలాగా అతని కుళ్ళు కుతంత్రాలు చేతకావని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సందర్భంగా మాట్లాడారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !