తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై ఉన్న కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు అంటూ ఆయన పై నమోదైన కేసులో సరైన ఆధారాలు లేవు అంటూ ఏపీ హైకోర్టు ఈ కేసు ని కొట్టి వేయడం జరిగిందట. పూర్తి వివరాల్లోకి వెళితే విజయవాడలోని సూర్యారావు పేటలో ఈ కేసు నమోదు అయింది. 2021 జూన్ లో టిడిపి సీనియర్ నేత అచ్చెన్నాయుడి ని పోలీసులు అరెస్టు చేసి శ్రీకాకుళంలోని ఆయన నివాసం నుండి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించడం జరిగింది. ఆ సందర్భంగా అచ్చెన్నాయుడి ను పరామర్శించేందుకు సూర్యారావుపేట నుండి కోర్టు సెంటర్ కి లోకేష్ వెళ్లారు. ఆ సమయం లో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి.
కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ నారా లోకేష్ పై అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ మొదటి అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ముందు నారా లోకేష్ హాజరయ్యారు. కేసు విషయమై లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టివేయాలని హైకోర్టులో లోకేష్ తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఆయన ఉన్నారు కనుక కోవిడ్ నిబంధనలను ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా లాయర్ వాదించారు అని సమాచారం అందుతుంది. హైకోర్టు లోకేష్ యొక్క వాదనలకు సంతృప్తి చెంది తీర్పును పాజిటివ్ గా ఇవ్వడం జరిగింది. దీంతో నారా లోకేష్ కి ఆ కేసు విషయంలో పెద్ద ఊరట లభించినట్లు అయింది.