తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. కేసీయార్‌తో భేటీ కోసం కవిత ప్రగతి భవన్‌కి రావడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఎమ్మెల్సీ కవిత పై తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. వంద కోట్ల ముడుపులకు సంబంధించి కవిత, శరత్ రెడ్డి తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈడీ పిలుపు నేపథ్యంలో.. లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారనీ, సిమ్ కార్డులు సైతం మార్చారనీ ఈడీ ఇప్పటికే పట్టుబడిన ఓ నిందితుడి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సంగతి తెలిసిందే.
విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేయడం, తన ఇంట్లో విచారణకు సహకరిస్తానని కవిత సమాధానం పంపడం జరిగి పోయాయి. ఈడీ విచారణ నేపథ్యంలోనే కవిత, కేసీయార్‌ని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. కవితను కేసీయార్ ఎలా ఓదార్చుతారు, ఆమెకు కేసీయార్ అటు ముఖ్యమంత్రిగా, ఇటు తండ్రిగా ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తారు.? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈడీ దాడులకు భయపడేది లేదని, జైలుకు వెళ్ళాల్సి వచ్చినా భయపడబోనని ఇప్పటికే కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే.