: హైద్రాబాద్ మెట్రో.. భాగ్యనగరానికి తలమానికం.! మెట్రో రాకతో హైద్రాబాద్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందన్నది నిర్వివాదాంశం. ప్రజా రవాణాకి సంబంధించి మెట్రో చాలా చాలా ఉపయోగకరంగా మారింది. ఇంకా ఇంకా మెట్రో సేవలు విస్తరించాల్సిన ఆవశ్యకతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మెట్రో సేవల్ని అంతర్జాతీయ విమానాశ్రాయినికి లింక్ చేసేందుకు సమాయత్తమైంది తెలంగాణ ప్రభుత్వం. హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ లోగో… హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ పేరుతో లోగో బయటకు వచ్చింది. మెట్రో రైలు .. ఎగురుతున్న విమానం..
రెండూ కలగలిసి చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది ఈ లోగో డిజైన్. మూడేళ్ళలోనే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఇటీవల ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించిన సంగతి తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే.. మెట్రో లైన్ చుట్టు పక్కల ప్రాంతాలు మరింత గణనీయమైన అభివృద్ధిని సాధిస్తాయి. తొలిసారిగా ఈ ప్రాజెక్టులో భూగర్భ లైన్ కూడా డిజైన్ చేయడం గమనార్హం.