UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 బనానా కేక్.. చేయడం చాలా ఈజీ.. వీకెండ్ స్పెషల్

డిసెంబర్ వచ్చిందంటే చాలు కేక్​ల సీజన్ వచ్చినట్లే. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో చాలా మంది కేక్​లనను ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. అయితే ఓ సింపుల్​ రెసిపీతో.. మీ కేక్​ను మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీకెండ్​కి ఇంట్లో ఈ కేక్ తయారు చేసుకుని.. క్రిస్మస్​ లేదా న్యూ ఇయర్​కి, లేదా మీ ఇంట్లోవారి బర్త్​డేలకు మీరే ఈజీగా ఈ కేక్ తయారు చేసేయవచ్చు. వారి అభిమానం పొందవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * వెన్ – 210 గ్రాములు * బ్రౌన్ షుగర్ – 240 గ్రాములు * అరటిపండ్లు – 150 గ్రాములు (పండినవి) * పాలు – 200 గ్రాములు * ఆల్ పర్పస్ ఫ్లోర్ – 300 గ్రాములు * బాదం – 100 గ్రాములు * గుడ్లు – 3 * బేకింగ్ పౌడర్ – 10 గ్రాములు * దాల్చిన చెక్క పొడి – 2 గ్రాములు తయారీ విధానం.. ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో.. గది ఉష్ణోగ్రత వద్ద.. వెన్నను, చక్కెరను మెత్తగా కలపండి. ఇప్పుడు అరటిపండును బాగా స్మాష్ చేసి.. పాలు కూడా వేసేయండి. అవి బాగా కలిసిన తర్వాత ఆల్ పర్పస్ పిండి, బేకింగ్ పౌడర్, దాల్చినచెక్క పొడి వేసి.. ఉండలు లేకుండా బాగా కలపండి. మీ కేక్ మిశ్రమం రెడీ అయిపోయింది. మీరు దీనిని ఓవెన్లో అయినా కుక్ చేయవచ్చు. లేదంటే కుక్కర్ ఉపయోగించి కూడా.. మీరు ఈ కేక్ తయారు చేసుకోవచ్చు. కుక్ చేయడం పూర్తైన తర్వాత.. ఫ్రెష్ క్రీమ్​తో డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే అలానే తినేయొచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !