UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 తాడోబా రిజర్వులో నాలుగు పులి పిల్లల మృతి

షేయోని ఫారెస్ట్ రేంజ్‌ (Sheoni forest range)లో ఓ తల్లి పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని మూడు రోజలు కూడా కాకముందే మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని తాడోబా టైగర్ రిజర్వు (Tadoba tiger reserve)లో నాలుగు పులి పిల్లలు (Tiger Cubs) చనిపోయి కనిపించాయి. శనివారం ఉదయం వీటిని గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మరణించిన పులి పిల్లల వయసు 3-4 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. తల్లి పులి కళేబరం కనిపించిన ప్రాంతంలోనే ఇవి కూడా కనిపించినట్టు తాడోబా-అంధారి టైగర్ రిజర్వు ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ జితేంద్ర రామ్‌గోయంకర్ పేర్కొన్నారు. చనిపోయిన పులి పిల్లల్లో రెండు మగవి కాగా, మిగతా రెండు ఆడవి.

అడవిలో ఇవి పుట్టినప్పటి నుంచి వాటిని పర్యవేక్షిస్తున్న షేయోని రేంజ్ ఫారెస్ట్ అధికారి సారథ్యంలోని ర్యాపిడ్ రెస్పాన్స్ టీం శుక్రవారం ఆ ప్రాంతానికి సమీపంలో ఓ మగ పులిని గుర్తించింది. చనిపోయిన నాలుగు పులి పిల్లలపై కొరికిన గాయాలు ఉన్నాయని, దీనిని బట్టి చూస్తే ఆ మగపులే వాటిని చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. పులి పిల్లల కళేబరాలను పోస్టుమార్టం కోసం చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్ (TTC)కి తరలించారు. దేశంలోని పురాతన జాతీయ పార్కుల్లో తాడోబా ఒకటి. ఇది 1,727 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో 120 పులులు, చిరుతలు, అడవి కుక్కలు, హైనాలు, అడవి పందులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు సహా అరుదైన వన్యప్రాణాలు ఉన్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !