UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 వైన్‌,బీర్ లతో, క్యాన్సర్ ముప్పు అధికం, తేల్చిన తాజా అధ్యయనం!

చాలా మంది వైన్, బీర్ లాంటివి తాగితే ఆరోగ్యానికి మంచివేనని నమ్ముతారు. అయితే పెరిగిన ఆల్కహాల్ వినియోగంతో ఆల్కహాల్-సంబంధిత క్యాన్సర్, ఇతర అన్ని క్యాన్సర్‌లకు అధిక ప్రమాదాలతో ముడిపడి ఉందని తాజా అధ్యయనం ఫలితాలు నిరూపించాయి. వైన్‌తో సహా అన్ని రకాల ఆల్కహాలిక్ పానీయాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ముఖ్యంగా వైన్, బీర్, మద్యం వంటి ఇథనాల్ కలిగిన పానీయాలు రొమ్ము, నోరు , పెద్దప్రేగు క్యాన్సర్‌లతో సహా మొతంగా ఏడు రకాల క్యాన్సర్ వ్యాధికి కారణం అవుతున్నట్లు అధ్యయనాలు తెలిపాయి. అయితే చాలా మంది తమకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందో అవగాహన కలిగి ఉండటం లేదు. దీనికి కారణాలను విశ్లేషించడం కోసం పరిశోధకులు పరిశోధనలు చేపట్టారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల డేటాను పరిశీలించారు. ఎక్కువ అల్కాహాల్ సేవించే వారిలో క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని వారు కనుగొన్నారు. యూఎస్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ క్యాన్సర్‌కు ఆల్కహాల్ ఒక ముఖ్య కారణం అని ఈ అధ్యయనాలకు నాయకత్వం వహించిన ఆండ్రూ సీడెన్‌బర్గ్ అన్నారు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ అయిన క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్, ప్రివెన్షన్‌లో అధ్యయన ఫలితాలను ఇటీవల ప్రచురించారు. Alcohol-related Cancers – మద్యపానం తగ్గిస్తే, క్యాన్సర్ ముప్పు తగ్గుముఖం మద్యం చేయనివారితో పోల్చితే అతిగా మద్యపానం చేసే వారికి ఆల్కాహాల్ ఆధారిత క్యాన్సర్ వచ్చే ముప్పు అధికం. ఈ క్యాన్సర్ ఇతర క్యాన్సర్ రకాలను ప్రేరేపిస్తుంది. అదేసమయంలో మద్యపానం చేయడం తగ్గిస్తే లేదా మానేసే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని కూడా అధ్యయనం పేర్కొంది. “వైన్‌తో సహా అన్ని రకాల ఆల్కహాలిక్ పానీయాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఆల్కహాల్ వినియోగం వల్ల వచ్చే క్యాన్సర్ ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలల్సిన అవసరాన్ని ఈ పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి” అని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ బిహేవియరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అసోసియేట్ డైరెక్టర్ విలియం MP క్లైన్ అన్నారు. “ఆల్కహాల్ అతి వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుందనే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వలన, వారు అప్రమత్తం అవుతారు. ఈ రకంగా అధిక ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించవచ్చు, అలాగే క్యాన్సర్ వ్యాధి మరణాలను కూడా తగ్గించవచ్చు” అని క్లీన్ చెప్పారు. చివరగా ఆ అధ్యయనం ప్రకారం చెప్పదలుచుకున్నదేమిటంటే అది బీర్ అయినా, వైన్ అయినా తక్కువ మోతాదు కలిగిన ఆల్కాహాల్ పానీయమైనా, అతి వినియోగం కూడా క్యాన్సర్ వ్యాధికి ఒక కారణం. కాబట్టి అన్ని రకాల ఆల్కాహాల్ ఉత్పత్తులు ఏ రకంగానూ ఆరోగ్యానికి మంచివి కావు. తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం చేస్తే క్యాన్సర్ ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !