UPDATES  

Author: Admin

పార్టీలోకి వచ్చిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది… అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు…. మన్యం న్యూస్ చండ్రుగొండ,అక్టోబర్ 9: బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు తప్పక ఉంటుందని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు అన్నారు. సోమవారం తిప్పనపల్లి పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్(1వ వార్డు) బొల్లిపోగు నాగేష్, కాంగ్రెస్ నాయకుడు కాకటి నాగేష్ లు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ… తిప్పనపల్లి పంచాయతీ అభివృద్ధి బాధ్యత నాది అని అన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. గ్రామంలో సీసీరోడ్లు, పైప్ లైన్ మంజూరి చేయటం జరిగిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుగులోత్ రమేష్, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »