అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణ Balakrishna … స్టార్ హీరోలతో చేస్తున్న సందడి మాములుగా లేదు. సాధారణ ఇంటర్వ్యూ మాదిరిగా కాకుండా సరికొత్తగా తనలోని చిలిపితనాన్ని బయటకు తీసి తెగ సందడి చేస్తున్నాడు బాలయ్య. ఇక న్యూ ఇయర్ కానుకగా బాలకృష్ణ షోకి ప్రభాస్ గెస్ట్‌గా రాబోతున్నాడు. ఇందుకు సంబంధించి ఆహా అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ప్రభాస్‌ను ఎపిసోడ్ మొత్తం డార్లింగ్ అని పిలుస్తూనే ఉన్నాడట బాలయ్య. ప్రభాస్, Prabhas , గోపీచంద్, Gopichandల స్నేహాంలోని మరో కోణాన్ని చూపించేలా ఈ ఎపిసోడ్ ఉండబోతోందని , ఇక ప్రభాస్,Prabhas,పెళ్లి గురించి కూడా బాలయ్య, Balayya, కూపీ లాగే ప్రయత్నం చేసినట్టు ప్రచారం నడుస్తుంది.
ఇటీవల ఎపిసోడ్ వర్కింగ్ స్టిల్స్ బయటకు రాగా, ఇలా వైరల్ అవుతున్నాయి. ఇక రేపొద్దున ప్రోమో వస్తే.. ఆ తరువాత ఎపిసోడ్ వస్తే.. సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే షోలో ప్రభాస్‌తో పలువురు స్టార్స్‌తో ఫోన్‌లో మాట్లాడించనున్నాడట బాలయ్య. ముందుగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కు కాల్ చేస్తాడట. అక్కడ ప్రభాస్, బాలయ్య, Balakrishna కలిసి చరణ్‌తో ముచ్చట్లు పెట్టగా, అనేక ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయట. అలాగే మరో స్టార్ హీరోయిన్ శృతీహాసన్‌కు కూడా బాలయ్య ఫోన్ కలిపి ఇస్తే ప్రభాస్ రొమాంటిక్ డైలాగులతో శృతిని తెగ ఆటపట్టించాడని చెప్పుకుంటున్నారు.
శృతిని అటు ప్రభాస్‌తో పాటు ఇటు బాలయ్య కలిసి ఆడుకున్నారని ఇది ఎపిసోడ్‌కి హైలైట్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. శృతి ఇటు ప్రభాస్‌తో సలార్,Salar, అటు బాలయ్యతో కలిసి వీరసింహారెడ్డి, Veerasimha Reddy, అనే చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ విషయానికి వస్తే ఆయన పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. బాలీవుడ్,Bollywood, డైరెక్టర్ ఓం రౌత్, Director Om Raut, దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K, Project K, సినిమాలు చేస్తున్న ప్రభాస్.. మారుతీ దర్శకత్వం, Directed Maruti, లో కూడా ఓ సినిమా చేయనున్నాడు. వీటిపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.