UPDATES  

 తమన్నా ని తల్లిని చేస్తా …. టాప్ డైరెక్టర్ !

రెండు దశాబ్ధాలుగా కెరీఎర్ కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికీ తను వరుస సినిమాలు చేస్తూనే ఉంది. అయితే అమ్మడు చేస్తున్న సినిమాలేవి ఈ మధ్య సక్సెస్ అందుకోవట్లేదు. టాలీవుడ్ టు బాలీవుడ్ అక్కడ ఇక్కడ తన సినిమాలతో అలరిస్తున్న తమన్నా చేస్తున్న సినిమాల ఫలితాలు నిరాశపరచడంతో డీలా పడుతుంది. ఈ టైం లో తమన్నాని కాపాడేందుకు ఒక డైరెక్టర్ ఆమెని తల్లిని చేయాలని అనుకుంటున్నాడు. అది కూడా పెళ్లి చేసుకోకుండానే తమనాని తల్లిని చేస్తాడట.

తమన్నా కెరీర్ కి ఆమె తల్లి అవడానికి కారణం ఏంటని అనుకోవచ్చు. సినిమాల్లో హీరోయిన్ గా రాణించలేని తమన్నా హీరోయిన్ గా కాకుండా కథా బలం ఉన్న సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో ఒక బాలీవుడ్ డైరక్టర్ తమన్నాకి ఒక కథ వినిపించాడట. అందులో ఆమె తల్లి పాత్రలో కనిపించనుందట. పెళ్లి కాకుండానే తల్లి అయ్యి ఆమె బిడ్డ బాగోగులు చూస్తుందట. ఈ కథ తమన్నాకి బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు చెబితే దానికి ఓకే చెప్పిందట తమన్నా.

ఇలాంటి టైం లోనే రిస్క్ చేస్తే బెటర్ అని భావిస్తుంది తమన్నా. అందుకే ప్రయోగాత్మక సినిమాలను చేయాలని ఫిక్స్ అయ్యింది. తమన్నా ఇప్పటికీ గ్లామరస్ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఆమెని తల్లి గా అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో.. కానీ అమ్మడు మాత్రం తనకు వచ్చిన ఈ ఛాన్స్ ని వాడుకోవాలని ఫిక్స్ అయ్యింది. తమన్నా చేస్తున్న ఈ తల్లి పాత్ర గురించి.. ఆ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న తమన్నా వాటి ఫలితాల గురించి ఆలోచించదలచుకోలేదు. రీసెంట్ గా అమ్మడు సత్యదేవ్ హీరోగా వచ్చిన గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !