UPDATES  

 దానిమ్మ తొక్కల ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు!

మనమందరం పండు తింటాం, తొక్కను పాడేస్తాం. కానీ తొక్కను కూడా తినేవారు మహానుభావులు. ఎందుకంటే కొన్నింటి తొక్కల్లో కూడా విశేషమైన పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా దానిమ్మ పండ్లలో ఎర్రటి పండ్లను మాత్రమే తింటారు, వాటి తొక్కలు కఠినంగా ఉంటాయి కాబట్టి, దానిమ్మ తొక్కలను ఎవరూ స్వీకరించరు. ఆయుర్వేద వైద్యంలో దానిమ్మ రసంతో పాటు, తొక్కలకు కూడా ప్రాధాన్యత ఉంది. ఎర్రటి దానిమ్మ తొక్కల్లో వాటి గింజలు, రసం కంటే కూడా 50 శాతం అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. దానిమ్మలు తినడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. Pomegranate Peels Benefits- దానిమ్మ తొక్కలతో ప్రయోజనాలు దానిమ్మ తొక్కలతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది దానిమ్మ తొక్కలు జుట్టు రాలడాన్ని ఎదుర్కోవటానికి, చుండ్రు సమస్యను నివారించడానికి సహాయపడతాయి.

ఎండిన దానిమ్మ తొక్కలను పొడిగా చేసి, కొబ్బరినూనెతో కలపండి. ఆ తర్వాత జుట్టు మూలాలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. అప్లై చేసిన రెండు గంటల తర్వాత మీ జుట్టును తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి. మీ సౌలభ్యం ప్రకారం రాత్రంతా ఉంచకోవచ్చు కూడా. ఇలా అప్పుడప్పుడు చేస్తే జుట్టురాలడం తగ్గుతుంది. గొంతు నొప్పి, దగ్గు నయం సాంప్రదాయ ఔషధ పద్ధతుల ప్రకారం, దానిమ్మ తొక్క దగ్గు నుండి , గొంతు నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దానిమ్మ తొక్కల పొడిని నీటితో కలిపి ఆ నీటితో గొంతును గరగరలాడించాలి. దానిమ్మ తొక్క యొక్క హైడ్రో ఆల్కహాలిక్ సారం గొంతు నొప్పి, దగ్గు చికిత్సలో సహాయపడే యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. చర్మం ముడతల నివారణ దానిమ్మ తొక్కలలోని సారం చర్మంలోని కొల్లాజెన్ విచ్ఛిన్నతను నిరోధిస్తాయి, చర్మ కణాల ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది వృద్ధాప్య ఛాయలు, ముడతలను సమర్థవంతంగా ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. దానిమ్మ తొక్కల లోని ఔషధ గుణాలు చర్మంపై మొటిమలు, మచ్చలు, దద్దుర్లుతో సమర్థవంతంగా పోరాడుతాయి.

ఈ పీల్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు బ్యాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్‌లను నశింపజేస్తాయి. వినికిడి లోపం పరిష్కారం వయస్సు పెరిగే కొద్దీ చాలా మందికి వినికిడి లోపం తలెత్తుతుంది. దీనికి కారణం శరీరంలో జరిగే ఆక్సీకరణ ఒత్తిడి. దానిమ్మ తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. అవి వినికిడి లోపాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. శరీర నిర్విషీకరణ దానిమ్మ తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిక్ ఏజెంట్లతో కూడా చురుకుగా పోరాడుతాయి. అందువల్ల, దానిమ్మ తొక్కలోని కంటెంట్ శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి ఉపయోగించడానికి ఒక సమర్థవంతమైన సాధనం. దానిమ్మ తొక్క సజల సారం నిర్విషీకరణను ప్రోత్సహిస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. శరీరంలో ఉండే టాక్సిన్స్‌తో పోరాడడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది దానిమ్మ తొక్కలు గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీసే ప్రమాద కారకాలను తగ్గించగలవు. 1,000mg దానిమ్మ తొక్క సారంను సప్లిమెంట్ చేయడం వల్ల అధిక బరువు, ఊబకాయం ఉన్నవారిలో కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ అదుపులోకి వస్తాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !