UPDATES  

 ఇంట్లోనే కాలా జామూన్

అల్లనేరేడు పండు లాంటి నల్ల జామూన్ స్వీట్‌ను చూస్తేనే నోరు ఊరుతుంది. పైనుంచి కొద్దీగా క్రిస్పీగా, లోపలి నుంచి జ్యూసీగా రసాలూరుతూ ఉండే కాలా జామూన్ నోట్లో మెత్తగా కరుగుతూ ఉంటే అదొక మధురానుభూతి.

ఏ పార్టీలో అయినా, ఫంక్షన్‌లో అయినా పసందైన విందుతో పాటు చివరగా కాలా జామూన్ రుచిని ఆస్వాదించలేకపోతే ఏదో వెలతిలా ఉంటుంది.

అయితే కాలా జామూన్ తినాలనిపిస్తే ఇంట్లో చేసుకుంటే మనకు ఆ రంగు, రుచి, కమ్మదనం లభించకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది స్టోర్‌లో కొనుగోలు చేసిన ఇన్ స్టంట్ జామూన్ మిక్స్ ఉపయోగిస్తారు. ప్యాకెట్ మీద ఎంతో అందంగా కనిపించే జామూన్, మనం చేస్తే ఎంతో మందంగా వస్తాయి. విరిగిపోయి, పిండి తిన్నట్లుగా ఉంటుంది. మరి అలా కాకుండా కాలా జామూన్ అద్భుతంగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఇన్‌స్టంట్ జామూన్ మిక్స్ వాడకుండా కూడా జామూన్ చేయవచ్చు. ఎలా తయారు చేయాలి, కావలసిన పదార్థాలేమి ఇక్కడ అందిస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన కాలా జామూన్ రెసిపీతో తియ్యని వేడుక చేసుకోండి మరి.

Kala Jamun Recipe కోసం కావలసినవి

పనీర్ 200గ్రా
ఖోవా 50గ్రా
పాలపొడి 2 స్పూన్లు
రవ్వ 1 స్పూన్
మైదా1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి 1/2 టీస్పూన్
చక్కెర 2 కప్పులు
నీళ్లు 5 కప్పులు
వేయించడానికి నూనె లేదా నెయ్యి
కాలా జామూన్ తయారీ విధానం

కాలా జామూన్ తయారీకి పనీర్, ఖోవా, రవ్వ, మైదా, యాలకుల పొడి ప్రధానమైన పదార్థాలు
అన్ని ప్రధాన పదార్థాలను ఒక చోట కలిపి బాగా మిక్స్ చేయండి. 2-3 సార్లు మిక్స్ చేయడం ద్వారా చక్కని పిండి ముద్ద తయారవుతుంది.
ఇప్పుడు ఈ పిండి ముద్ద నుండి చిన్న చిన్న ఉండలను జామూన్ లేదా గుండ్రంగా తయారు చేయండి.
తయారు చేసుకున్న జామూన్‌లను నూనె లేదా నెయ్యిలో తక్కువ నుండి మీడియం మంట మీద ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
జామూన్ ముదురు గోధుమ రంగు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని మరిగిన సిరప్‌లో మార్చాలి.
షుగర్ సిరప్ నీళ్లు చక్కెర కలిపి 10 నిమిషాలు ఎక్కువ మంటలో ఉడకబెట్టండి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఈ సిరప్‌లో జామూన్ లను వేసి మూతపెట్టి పది నిమిషాలు ఉంచండి.
అంతే, నోరూరించే కాలా జామూన్ రెడీ. కమ్మగా ఆస్వాదించండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !