బాలయ్య బాబు సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. అతని మూవీ వీర సింహా రెడ్డి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ల జోరును మేకర్స్ పెంచారు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సుగుణ సుందరి సాంగ్ రిలీజ్ డేట్‌ను మంగళవారం (డిసెంబర్ 13) అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌కు ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ సుగుణ సుందరి రిలీజ్‌కు టైమ్ దగ్గర పడింది. ఈ సెకండ్ సింగిల్‌ను గురువారం (డిసెంబర్ 15) ఉదయం 9.42 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ చెప్పారు. ఈ అనౌన్స్‌మెంట్‌తోపాటు మేకర్స్ ఓ రొమాంటిక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య హీరోయిన్‌ను టీజ్ చేస్తూ కనిపిస్తున్నాడు. అంతేకాదు అతడు చాలా యంగ్ అండ్ ఎనర్జటిక్‌గా కూడా ఉన్నాడు. ఈ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.
తాజాగా వీర సింహా రెడ్డి రన్‌టైమ్‌ను కూడా వెల్లడించారు. ఈ సినిమా 2 గంటల 43 నిమిషాల నిడివితో కాస్త పెద్దగానే ఉండనుందని చెప్పాలి. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఓ గెటప్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించగా మరో క్యారెక్టర్ స్టైలిష్‌గా ఉంటుందని సమాచారం.