UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 లాస్ ఎంజిలాస్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్‌లో కీరవాణికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పురస్కారం

దర్శకుడిగా తాను ప్రపంచస్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటానని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాస్ అని తెలిపాడు రాజమౌళి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్‌, లాస్ ఎంజిలాస్ క్రిటిక్స్ అవార్డ్స్ వేడుకల్లో సత్తా చాటింది. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్‌లో బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి అవార్డును అందుకోగా లాస్ ఎంజిలాస్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్‌లో కీరవాణికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పురస్కారం దక్కింది.

ఈ సందర్భంగా రాజమౌళిని అభినందిస్తూ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. దర్శకుడిగా రాజమౌళి సినీ ప్రపంచాన్ని ఏలుతున్నాడని ప్రభాస్ అన్నాడు. బెస్ట్ డైరెక్టర్‌గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ అవార్డుతో పాటు లాస్ ఎంజిలాస్‌లో బెస్ట్ డెరైక్టర్‌గా రన్నరప్ అవార్డ్ రాజమౌళి అందుకోవడం ఆనందంగా ఉంది అంటూ పేర్కొన్నాడు. రాజమౌళితో పాటు కీరవాణికి ప్రభాస్ శుభాకాంక్షలు అందజేశాడు.

ప్రభాస్ పోస్ట్‌కు రాజమౌళి స్పందించాడు. ప్రపంచస్థాయి దర్శకుడిగా నేను పేరు తెచ్చుకుంటానని నాకంటే ముందు నన్ను నమ్మిన వ్యక్తి వి నువ్వు థాంక్స్ డార్లింగ్‌ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రభాస్‌, రాజమౌళి మధ్య సాగిన సంభాషణ సోషల్ మీడియాలో సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో ఛత్రపతితో పాటు బాహుబలి, బాహుబలి -2 సినిమాలు రూపొందాయి. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !