పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ(Pakistan Tehreek-e-Insaf) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళతో అసభ్యంగా, శృంగారానికి ఒత్తిడి చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. పాకిస్తాన్ లో సంచలనం సృష్టిస్తోంది. Imran Khan’s audio clip: రెండు పార్ట్ లుగా.. ఆ ఆడియో క్లిప్ లను రెండు పార్ట్ లుగా పాక్ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్(YouTube) చానెల్ లో షేర్ చేశారు. ఆ క్లిప్స్ కొద్ది సేపట్లోనే వైరల్ అయి, పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఒక వ్యక్తి ఒక మహిళతో అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడుతున్నట్లుగా ఆ క్లిప్స్ లో ఉంది. ఆ వ్యక్తి గొంతు ఇమ్రాన్ ఖాన్ దేనని భావిస్తున్నారు. ఈ రెండు ఆడియో క్లిప్స్ లో ఒకటి పాతదేనని, మరొకటి రీసెంట్ ఆడియో అని తెలుస్తోంది. రెండో ఆడియోలో, ఆ యువతిని తనకు దగ్గరగా రావాలని ఇమ్రాన్ కోరుతున్నట్లు, అందుకు ఆ యువతి నిరాకరిస్తున్నట్లుగా, దాంతో, ఇమ్రాన్ ఆమెను దగ్గరకు రావడానికి ఒత్తిడి చేసినట్లుగా ఉంది
. ఆ తరువాత కాసేపటికి, ఆరోగ్యం బాగాలేదని, ఆరోగ్యం సహకరిస్తే మర్నాడు వస్తానని ఇమ్రాన్ తో ఆమె చెప్పడం వినిపిస్తుంది. ఆమె వస్తానంటే తన ష్కెడ్యూల్ ను మార్చుకుంటానని, మర్నాడు తన భార్య, పిల్లలు వస్తున్నారని, ‘నువ్వు వస్తానంటే, వారు లేట్ గా వచ్చేలా చూస్తాన’ని ఇమ్రాన్ ఆమెకు చెప్పడం కూడా అందులో ఉంది. PTI responds to Imran Khan’s audio clip leak: అన్నీ అబద్ధాలు ఈ ఆడియోపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ స్పందించింది. అది నకిలీ ఆడియో అని, ఇమ్రాన్ ఖాన్ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఇమ్రాన్ ఖాన్ గొంతును మిమిక్రీ చేసి దాన్ని రూపొందించారని ఆరోపించింది. గతంలో కూడా ఇమ్రాన్ కు సంబంధించిన పలు ఆడియో రికార్డులు బయటకు వచ్చాయి. ప్రధాని పదవిని ఇమ్రాన్ కోల్పోయిన తరువాత.. ఆయనపై వరుసగా ఆడియో క్లిప్ లు విడుదల అవుతున్నాయి. ఇమ్రాన్ పై అధికార పార్టీ, ఆర్మీ కలిసి చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఆడియో క్లిప్ లని పీటీఐ, ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. Imran khan Viral audio: సోషల్ మీడియాలో వైరల్ ఈ క్లిప్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వీటిపై భారీగా స్పందిస్తున్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ .. ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ’ అయ్యారంటూ ఒక నెటిజన్ స్పందించారు.