UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 తెలుగుదేశం (telugudesam party) పార్టీ వల్లే తెలంగాణ (telangana) అభివృద్ధి

తెలుగుదేశం (telugudesam party) పార్టీ వల్లే తెలంగాణ (telangana) అభివృద్ధి సాధించిందని… ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

హైదరాబాద్ లో పుట్టిన టీడీపీ పేదల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని అభివృద్ధి చేశామని… ఇప్పుడదే నగరం తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఆవిర్భవించిందని చెప్పారు. 25 ఏళ్ల దూర దృష్టితో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని స్పష్టం చేశారు. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన పునర్ నిర్మాణ సభలో పాల్గొనేందుకు వెళుతూ…. కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. నాయకన్ గూడెం వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

వేలాదిగా విచ్చేసిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ… ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవమని బాబు అన్నారు. ప్రతి గ్రామం లో ఆ మహనీయుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకులు జరుపుకుంటున్న సందర్భంలోనే టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం టీడీపీ వల్లే వచ్చిందని చెప్పారు. రైతులు, పేదల పిల్లలను ఐటీ నిపుణులుగా చేశామని గుర్తుచేశారు. నాడు తాను సెల్ఫోన్ గురించి మాట్లాడితే అంతా హేళన చేశారని.. ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. టీడీపీ అందించిన ఐటీ అభివృద్ధిని అందుకుని… నేడు మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడుతున్నారని వెల్లడించారు. అనంతరం… ఖమ్మం ఇల్లెందు క్రాస్ రోడ్ లోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న తెలంగాణ టీడీపీ పునర్ నిర్మాణ సభలో పాల్గొనేందుకు వెళ్లారు.

తెలంగాణలో పూర్వ వైభవమే లక్ష్యంగా.. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సభ విజయంతం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా సన్నాహక సమావేశాలు జరిగాయి. ఈ సభ ద్వారా కేడర్ లో ఉత్తేజం నింపి, రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకుంటామని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !