UPDATES  

 విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలను కొనుగోలు

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్లను పెంచింది. దీంతో అన్ని దేశాల కరెన్సీలు పడిపోయాయి. అమెరికన్ డాలర్ తో రూపాయి మరకం విలువ కూడా చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరింది. అమెరికా ద్రవ్య విధాన వైఖరితో డాలర్ రాకెట్‌ లా పైకి దూసుకెళ్లింది. దీంతో 2022లో భారత రూపాయి 10.14% పతనంతో అత్యంత దారుణంగా పడిపోయిన ఆసియా కరెన్సీగా నిలిచింది. 2013 తర్వాత దాని అతిపెద్ద వార్షిక క్షీణతగా రూపాయి పడిపోయింది. రూపాయి అమెరికా కరెన్సీతో 82.72 వద్ద సంవత్సరాన్ని ముగించింది. 2021 చివరి నాటికి 74.33 ఉండగా.. ఇప్పుడు మరింతగా పడిపోయింది. అయితే డాలర్ ఇండెక్స్ 2015 నుండి దాని అతిపెద్ద వార్షిక లాభం వైపు పయనిస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా చమురు ధరల ర్యాలీకి రూపాయి కూడా ఒక బాధితుడిగా మారింది. ఇది సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశం యొక్క కరెంట్ ఖాతా లోటును రికార్డు స్థాయికి నెట్టింది. 2023 నాటికి మార్కెట్ పార్టిసిపెంట్‌లు రూపాయి విలువ పెరుగుదల మరింతగా ఉంటుందని.. విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలను కొనుగోలు చేయడం కొనసాగించవచ్చని భావిస్తున్నారు. ఫెడ్ ఊహించిన దానికంటే ఎక్కువ కాలం రేట్లు ఉంచవచ్చు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల మందగమనం దీర్ఘకాలిక మాంద్యంగా మారితే, భారతదేశ ఎగుమతులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇవి రూపాయికి రెండు కీలక ప్రమాదాలుగా మారుతాయి. చాలా మంది వ్యాపారులు.. విశ్లేషకులు కరెన్సీ మొదటి త్రైమాసికంలో గట్టి 81.50-83.50 శ్రేణి మధ్య కదులుతుందని భావిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !