ఈరోజుల్లో జుట్టు నెరవడం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరి జుట్టు నెరిసిపోవడం సహజం. వయసు 35 ఏళ్లు దాటిన తర్వాత అక్కడక్కడా జుట్టు తెల్లబడటం జరుగుతుంది. కానీ ఇప్పుడు చూస్తే వయసు 20 లలో ఉన్నవారికి వారికి కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఇందుకు తప్పుడు జీవనశైని అనుసరించడం, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, జుట్టుకు ఉపయోగించే ఉత్పత్తులు కారణం అవుతాయి. కొన్ని అరుదైన సందర్భాలలో ఔషధాల వాడకం, జన్యుపరమైన సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. వయసు పెరిగినపుడు జుట్టు తెల్లబడుతుందంటే అది సహజంగా తిరిగి నలుపు రంగులోకి మారదు. కానీ మీరు యవ్వనంలో ఉన్నప్పుడు కూడా అకస్మాత్తుగా జుట్టు నెరిసిపోతుంటే దానిని సహజ మార్గాలలోనే నల్లబరుచుకోవచ్చు. మీ జుట్టు అకాలంగా నెరిసిపోతే, అందుకు సరైన కారణాన్ని కనుగొనడం ద్వారా దానిని నియంత్రించవచ్చు. Premature Grey Hair Remedies- నెరిసిన జుట్టు నల్లబడేందుకు చిట్కాలు అకాలంగా తెల్లబడిన జుట్టును సహజంగా నల్లబరుచుకోవటానికి ఈ చిట్కాలు పాటించి చూడండి
– సాధారణంగా విటమిన్ల లోపం కారణంగా జుట్టు తెల్లబడుతుంది. శరీరంలో విటమిన్ బి, విటమిన్ బి-12, బయోటిన్, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ ఎ లోపం ఏర్పడినపుడు జుట్టు నెరిసిపోయేందుకు దారి తీస్తుంది. కాపర్, సెలీనియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి మూలకాలు కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైనవి. ఇలాంటపుడు మీరు మల్టీవిటమిన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోండి. పండ్లు, గింజలు, డ్రై ఫ్రూట్స్, ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తినండి. ఉదయం లేచిన తర్వాత ప్రతిరోజూ ఉసిరికాయ, అల్లం తురుము, తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి. – ప్రతిరోజూ కొబ్బరి నూనెతో జుట్టుకు మసాజ్ చేయండి. ఉదయాన్నే మీ జుట్టును కడగాలి. ఈ నూనెను జామకాయలో వేసి మరిగించి జుట్టుకు పట్టించాలి. – ఒక చెంచా నల్ల నువ్వులను వారానికి రెండు మూడు సార్లు తింటే తెల్లజుట్టు మళ్లీ నల్లగా మారుతుందని నిపుణులు చెబుతారు. – జుట్టు నెరసిపోవడానికి మరొక పెద్ద కారణం ఒత్తిడి అని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మీరు ఒత్తిడిని తగ్గించుకొని, ఎల్లప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా ఉండండి, మీ లుక్‌లో మీరు కచ్చితంగా తేడాను గమనిస్తారు. వీటిని నివారించండి మీ జుట్టుకు హాని కలిగించే కొన్ని పద్ధతులను మానుకోవడం మంచిది. – తరచుగా జుట్టుకు బ్లీచింగ్ చేయించుకోకూడదు – తడి జుట్టును బ్రష్ చేయడం చేయకూడదు, బదులుగా జుట్టు ఆరిన తర్వాత వెడల్పాటి పళ్ళు కలిగిన దువ్వెనను ఉపయోగించాలి. – కర్లింగ్ ఐరన్ లేదా హెయిర్ డ్రైయర్‌తో జుట్టుపై ఎక్కువ వేడిని వర్తింపజేయకూడదు. – కఠినమైన సబ్బులు, షాంపూలను జుట్టుకు ఉపయోగించడం మానుకోండి. తేలికైన షాంపూలను ఎంచుకోండి. – జుట్టును తరచుగా కడగడం కూడా చేయవద్దు. మెరుగైన జుట్టు సంరక్షణ చర్యలు తీసుకోవాలి. జుట్టు సమస్యలకు నిపుణులైన ట్రైకాలజిస్టులను సంప్రదించండి.