UPDATES  

 బాలీవుడ్ ని వదిలేస్తే మీరు పోర్న్‌ సినిమాలు కూడా తీస్తారు.. పఠాన్‌పై శక్తిమాన్‌ సీరియస్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌, దీపికా పదుకోన్‌ నటించిన పఠాన్‌ మూవీ నుంచి బేషరమ్‌ రంగ్‌ పాట ఎప్పుడైతే రిలీజ్‌ అయిందో అప్పటి నుంచీ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ పాటలో దీపికా వేసుకున్న డ్రెస్సులపై ఎంతో మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పాట మొత్తం ఆమె బికినీల్లోనే కనిపించింది. ఇక అందులోని దీపిక స్టెప్పులపై కూడా విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. ఈ సాంగ్‌లో ఆమె వేసుకున్న కాషాయ రంగు బికినీ అయితే దుమారం రేపింది. ఇది హిందూ మతానికి సంబంధించిన రంగు అని, ఇక ఇదే పాటలో షారుక్‌ ఆకుపచ్చ రంగు షర్ట్‌ వేసుకోవడంతో ఇది లవ్‌ జిహాద్‌ను సూచిస్తోందని ఎందరో విమర్శించారు. తాజాగా శక్తిమాన్‌ నటుడు ముకేశ్‌ ఖన్నా కూడా బేషరమ్‌ రంగ్‌ పాటపై విరుచుకుపడ్డాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికపై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ పాటలో మీకు అశ్లీలత కనిపించలేదంటే భవిష్యత్తులో పోర్న్‌ సినిమాలు తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

“కాషాయ రంగు బికినీ వేసుకున్న హీరోయిన్‌తో డ్యాన్స్‌ చేయించారు. అంతేకాదు కావాలని జూమ్‌ చేసి మరీ కాషాయ రంగు బికినీని ప్రేక్షకులకు చూపిస్తున్నారు. మరీ ఈ స్థాయి అశ్లీలతా? ఇక లిరిక్స్‌ కూడా బేషరమ్ రంగ్‌ అంటూ సాగింది. కాషాయ రంగు బికినీ వేసుకొని ఇంత అశ్లీలంగా డ్యాన్స్‌ చేస్తారా? ఇంత సిగ్గుమాలినతనమా?” అంటూ ముకేశ్‌ ప్రశ్నించాడు. “ఈ రంగును ఎంతో పవిత్రంగా భావించే హిందువులు దీనికి వ్యతిరేకంగా గళం విప్పరని మీరు అనుకుంటున్నారా? మేము కచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. ఉద్యమిస్తూనే ఉన్నాం. ఈ సిగ్గులేని సినిమాను, ఈ పాటను ఇక ఆ దేవుడే కాపాడాలి” అని ముకేశ్‌ అన్నాడు. అంతేకాదు తాను షేర్‌ చేసిన ఫొటోపై “ఇది మీకు అశ్లీలతగా అనిపించకపోతే మీరు పోర్న్‌ సినిమాలు కూడా తీస్తారు” అని రాశాడు. అయితే ముకేశ్‌ పోస్ట్‌పై ఎంతో మంది అభిమానులు స్పందించినా.. చాలా మంది అతన్ని తప్పుబడుతూనే కామెంట్లు చేశారు. ఆ రంగుకు ఎలాంటి కులం, మతంతో సంబంధం లేని ఓ యూజర్‌ రాశాడు. మీపై ఎంతో గౌరవం ఉంది.. కానీ ఇలాంటివి ముందు కూడా ఎన్నోసార్లు జరిగాయి అని మరో యూజర్‌ అన్నాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !