UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 హోంశాఖ తాజా నిషేధాజ్ఞలు సర్వత్రా చర్చనీయాం

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కారు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి, మంచి నిర్ణయమే ఇది. రోడ్లపై రాజకీయ పార్టల బహిరంగ సభలు, ర్యాలీల వల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా రెండు తొక్కిసలాటలు.. అదీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల వల్ల జరగడం, మొత్తంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మామూలుగా అయితే ఎవరైనా సమర్థించి తీరాల్సిందే.

అన్ని రోడ్లపైనా నిషేధం వర్తింపు.. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మునిసిపల్, పంచాయితీ రహదార్లపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతి లేదన్నది రాష్ట్ర హోం శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల సారాంశం. అయితే, ఈ నిషేధం అన్ని రాజకీయ పార్టీలకూ వర్తిస్తుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ముఖ్యమంత్రి బహిరంగ సభలు, ముఖ్యమంత్రి రోడ్ షోలు.. వీటికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయా.? అన్న ప్రశ్న ప్రజాస్వామ్యవాదుల నుంచి వస్తోంది. ప్రతిపక్షంలో వున్నప్పుడే కాదు, అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ చాలా కార్యక్రమాలు చేపట్టింది, చేపడుతూనే వుంది. వైసీపీ నేతలు పదే పదే ర్యాలీలు తీస్తుంటారు.. అదీ రోడ్ల మీదనే. వాటికీ ఈ నిషేధాజ్ఞలు వర్తిస్తాయా.? అన్నట్టు, నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుండడం.. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయనుండడం.. ఈ నేపథ్యంలో హోంశాఖ తాజా నిషేధాజ్ఞలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

   TOP NEWS  

Share :

Don't Miss this News !