UPDATES  

 ఏపీ మాజీ హోంమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే సుచరిత.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో సమీకరణాలు మారబోతున్నాయా.? 2024 ఎన్నికలకు 14 నెలల ముందు, రాజకీయ నాయకులు అట్నుంచి ఇటు.. ఇట్నుంచి అటు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న దరిమిలా.. ముందు ముందు ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయన్నది నిర్వివాదాంశం. వైసీపీ అధికారంలోకి వస్తూనే దళిత మహిళకు హోం మంత్రిత్వ శాఖను అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా రాష్ట్రానికి మహిళా హోంమంత్రే వున్నారు. మాజీ హోంమంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు..

మంత్రి వర్గ విస్తరణలో పదవి కోల్పోయారు సుచరిత. ఆ సమయంలో ఆమె పార్టీని వీడతారనే ప్రచారం జరిగింది. చివరికి వైఎస్ జగన్ బుజ్జగింపులతో ఆమె మెట్టు దిగక తప్పలేదు. తాజాగా సుచరిత పార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను వైసీపీ లో వుంటే, నా భర్త, పిల్లలు కూడా వైసీపీలోనే వుంటారు. ఒకవేళ నా భర్త పార్టీ మారాలనుకుంటే, భార్యగా నేను ఆయన వెంట నడవక తప్పదు..’ అని పేర్కొన్నారామె. ‘వైసీపీని పార్టీలా కాదు.. మా కుటుంబంలాగానే భావిస్తాను. వైసీపీని వీడే పరిస్థితి రాదనే అనుకుంటాను..’ అని సుచరిత చెప్పుకొచ్చారు. సుచరిత భర్త పార్టీ మారబోతున్నారన్న ప్రచారం దరిమిలా, ‘నా భర్త వెంటే నేను’ అని సుచిత సంకేతాలు ఇవ్వడం వెనుక అర్థమేంటో.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !