UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ఈ ఏడాది చివర్లో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పై అగ్రెసివ్‌ గా ఎటాక్ చేస్తున్న బండి సంజయ్ మరో వైపు ప్రజల్లోకి పాదయాత్ర పేరుతో వెళ్తున్న విషయం తెల్సిందే. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు బండి సంజయ్ తీర్థ యాత్రలు కూడా చేస్తున్నారు. తాజాగా శృంగేరి లోని శ్రీ శారదా పీఠం లో జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారిని బండి సంజయ్‌ దర్శించుకున్నారు.

శారదా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్‌ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో ముందు ఉండాలి అంటూ జగద్గురువులు బండి సంజయ్ కి తెలియజేసినట్లుగా బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే బండి సంజయ్ మరోసారి యాత్ర నిర్వహించే ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీఎం అభ్యర్థి బండి సంజయ్ అంటూ ఆ పార్టీలో కొందరు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి సీఎం అవ్వాలని బండి సంజయ్ ఆరాటపడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !