UPDATES  

 విద్య వైద్యం ఉపాధి ఉజ్వల భవిష్యత్తు కోసం మీ ముందుకు వచ్చింది డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్

విద్య వైద్యం ఉపాధి ఉజ్వల భవిష్యత్తు కోసం
మీ ముందుకు వచ్చింది డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్
జి ఎస్ ఆర్ ట్రస్ట్ మెగా జాబ్ మేళా సక్సెస్
నేను స్థానికుడ్ని సేవకుడిని… రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 07… సమాజంలో విద్య ,వైద్యం ఉపాధి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆవిర్భవించిందే డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఈ ట్రస్టు ద్వారా అందిస్తున్న సమాజ హితం కోరుతూ అనేక సేవా కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పడిన డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మెగా జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చదువుకున్న నిరుద్యోగ యువతకి ఉపాధి మార్గాలు కల్పించే ధ్యేయంగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జాబ్ మేళా ను ఏర్పాటు చేశామని ఈ మేళాలో 65 ప్రైవేట్ సెక్టార్లతో మాట్లాడి వారిని కొత్తగూడెం రప్పించి నిరుద్యోగ యువతకు ప్లేస్మెంట్ పెంచేందుకు కృషి చేశామన్నారు. చదువు అర్హతను బట్టి ఆ కంపెనీల్లో ఉద్యోగాలు పొంది వారి వారి కుటుంబాలను ఆర్థిక దిశగా పయనించేందుకు ఎంత దోహదపడుతుందన్నారు. తాను కొత్తగూడెం బిడ్డగా ఇక్కడే పుట్టి ఇక్కడే చదివి పై చదువులకు వేరే ప్రాంతాలకు వెళ్లినప్పటికీ పుట్టిన ఊరు రుణం తీర్చుకునేందుకు భగవంతుడు ఈ అవకాశాన్ని కల్పించాడని ఈ సింగరేణి నేలతల్లికి స్థానికులకు రుణపడి ఉంటాను అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల జాతర ప్రారంభించారని లక్ష పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఇప్పటికే వైద్య శాఖలో 938 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో పల్లె ప్రాంతాలతో కలుపుకొని వైద్యం అట్టడుగు వర్గానికి చేరే విధంగా అనేక డాక్టర్ల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. నేను చేస్తున్న ట్రస్టు సేవలను కొందరు విమర్శిస్తున్నారని అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా సేవే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన నిరుద్యోగ యువత కుటుంబాల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది వివిధ శాఖల చెందిన అధికారులు సంపూర్ణ సహకారాన్ని అందించారన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !