భద్రాచలం నియోజకవర్గం లో కాంగ్రెస్ కి ఎదురు గాలి
*ఎమ్మెల్యే పొందెం కి కష్ట కాలమే
*దళిత బందులో ఎమ్మెల్యే అనుచరులు డబ్బులు దండుకున్నారని ప్రధాన ఆరోపణ
*అభివృద్ధికి నోచుకోని భద్రాచలం నియోజకవర్గం
* బి ఆర్ ఎస్ వైపు ప్రజల చూపు
*మన్యం న్యూస్ కు అభిప్రాయాలు వెల్లడించిన నియోజకవర్గ ప్రజలు
మన్యం న్యూస్ నూగుర్ వెంకటాపురం: భద్రాచలం నియోజకవర్గం ప్రజలు అధికార పార్టీని కాదని ఎలక్షన్స్ కి కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో భద్రాచలంలో అడిగిపెట్టిన ప్రస్తుత ఎమ్మెల్యే పోదాం వీరయ్యకు భద్రాచలం నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ మెజార్టీతో గెలిపించారు. కానీ తాము గెలిపించుకున్న నాయకునితో తట్టెడు మట్టికూడా గ్రామాలలో పోసుకునే పరిస్థితి లేదని ఎమ్మెల్యే పనితీరు పట్ల ఆగ్రహంగా ఉన్నారు. మన్యం న్యూస్ కి వారు నాలుగు సంవత్సరాల పాలనపై వివరాలు వెల్లడించారు. భద్రాచలం నియోజకవర్గ ఓటర్లు చైతన్యవంతమైన ఓటర్లు. నాలుగేళ్ల కిందట సిపిఎం పార్టీ కంచుకోట భద్రాచలం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు.తక్కువ సమయంలో మలుగు నియోజకవర్గ నుండి వచ్చి భద్రాచలం నియోజకవర్గం లో పోదెం వీరయ్య అనూహ్య విజయం సాధించారు. కానీ ఎమ్మెల్యే అనుచర వర్గం తీరుతో కాంగ్రెస్ పార్టీ బలహీనత స్థితికి చేరుతుంది.
భద్రాచలం నియోజకవర్గం లో గెలుపు సాధించిన వీరయ్య తనను గెలిపించిన ప్రజలను మర్చిపోయారా? అని ప్రశ్నించడం జరుగుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది మండలాలతో ఉన్న భద్రాచలం నియోజకవర్గం విభజన తర్వాత ఐదు మండలాలు చర్ల ,దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం , భద్రాచలం నియోజకవర్గంఏర్పడింది. పోదేం వీరయ్య ఎమ్మెల్యే గా గెలిచి
నాలుగేళ్లు అయినా కూడా అభివృద్ధి పనులు మాత్రం జరగలేదని నియోజకవర్గం గుర్రుగా ఉన్నారు. ఓట్లప్పుడు కనిపించిన వీరయ్య నాలుగేళ్లు పూర్తయిన భద్రాచలం నియోజకవర్గం మండలాలలో చుట్టం చూపుగా పర్యటిస్తున్నారని ప్రజలంటున్నారు. అధికార బి. ఆర్.ఎస్ ని కాదని కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించుకుంటే ఏ ఒక్క అభివృద్ధి పని జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం మండలంలో జూనియర్ కాలేజీ , ఫైర్ స్టేషన్ లేకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఎదిరలో పాలెం ప్రాజెక్టు కాలువలు విస్తీర్ణం పెంచకుండా అలానే ఉన్నాయని దానివల్ల రైతాంగం ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు తమ బాధను వెల్లడించారు. ఇన్ని సమస్యలు ఉన్నా వీరయ్య ఏ మండలానికి రాకపోగా,ఏమాత్రం అభివృద్ధికి సంబంధించిన నిధులు తేలేదని మండలాలలో అభివృద్ధి శూన్యం అని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు .
దళిత బందులో ఎమ్మెల్యే అనుచరుల కమిషన్ల కక్కుర్తి
ముఖ్యమంత్రి కెసిఆర్ దళితుల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పథకం దళిత బంధు. ఐతే భద్రాచలం నియోజకవర్గం లో స్థానిక నాయకులు రెండు మూడు లక్షలు ఇస్తేనే కానీ దళిత బందు ఇవ్వట్లేదని దళిత బిడ్డలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇలా చేయడం చాలా బాధాకరమని దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ పథకం పెట్టడం జరిగిందని. పలువురు తమ ఆవేదన తెలియజేశారు. ఎమ్మెల్యే అనుచరుల దందా కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పొదెంకి తలనొప్పిగా మారింది.
భద్రాచలం ప్రజల చూపు బి.ఆర్ఎస్ వైపు
బి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలలో చొచ్చుకపోతున్నాయి. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ , గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు పుట్టిన బిడ్డకు కేటీఆర్ కిట్ తదితర పథకాలకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.భద్రాచలం నియోజకవర్గం ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. షాది ముబారక్, దళిత బంద్, వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పెన్షన్,రైతుబంధు,కళ్యాణ లక్ష్మి, ఒంటరి మహిళ.
ఇలా చాలావరకు పేదవాడు గౌరవంగా ఆర్థికంగా ఎదగలిగే విధంగా కులాలకు,వర్గాలకు అతీతంగా తెచ్చిన ఈ పథకాలు ఎంతగానో ప్రజల మనలను పొందుతున్నాయిఅని స్థానికంగా నియోజకవర్గాలలో వినబడుతుంది. ప్రజలకు ఉపయోగపడే ఇన్ని మంచి పథకాలతో ప్రజల ముద్దులై ఈసారి బి ఆర్ఎస్ పార్టీ నుండి అధిష్టానం ఎవరిని భద్రాచలం నియోజకవర్గం లో పెట్టిన గెలుపు డంక్క మోగడం ఖాయమని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.