బిఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఖమ్మం లో పెట్టడం సంతోషం
ఈనెల 18 న ఖమ్మం లో జరిగే సభను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలి -మాజీ మంత్రి తుమ్మల
మన్యం న్యూస్, దమ్మపేట, జనవరి 10: ఈనెల 18వ తారీకు ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలని ఖమ్మం జిల్లా కుసుమంచి లో ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లో జరగని అభివృద్ధిని పాలేరు లో చేసి చూపించామని అన్నారు. కొందరు తాత్కాలిక ఆనందాల కోసం ప్రజలను మభ్య పెట్టి పబ్బం గడుపుతున్నారు అన్నారు. శాశ్వత ప్రాతిపదికన జరిగే పనులకే తాను ఇష్టపడతానన్నారు. ప్రజల కష్టాలు కాదు కావలసింది వారి ఆనందం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృషి వాళ్ళ రహదారులు, సాగునీరు రావడంతో భూముల ధరలు పెరిగాయి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం అని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని తెలిపారు. దేవుడు ఇచ్చిన శక్తి మేరకు అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాం అని తెలిపారు.