UPDATES  

 సంక్రాంతి రోజు నో హాలీడే – సలార్ షూటింగ్‌లో ప్రభాస్

సంక్రాంతి పండుగను స్టార్ హీరోలు తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఘనంగా ఇంట్లోనే జరుపుకుంటే ప్రభాస్ మాత్రం సలార్ షూటింగ్‌తో బిజీగా గడిపారు.

సంక్రాంతికి హాలీడే కూడా తీసుకోకుండా షూటింగ్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటున్నట్లు సమాచారం. గ్యాప్ ఇస్తే మళ్లీ డేట్స్ అడ్జెస్ట్ కావడం కష్టం కావడంతో పండుగ రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా సలార్ షూట్‌ను కొనసాగించినట్లు తెలిసింది. ఆదివారం జరిగిన షూట్‌లో ప్రభాస్ కూడా పాల్గొన్నట్లు చెబుతున్నారు.

20 రోజులకుపైగా సాగనున్న ఈ షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కొంత టాకీ పార్ట్‌ను ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. కేజీఎఫ్ 2 తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా ప్రభాస్ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు.

సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తోన్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. ఖచ్చితంగా అదే డేట్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ప్రశాంత్ నీల్ బృందం ఉన్నట్లు చెబుతున్నారు.

సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కేజీఎఫ్, కాంతార సినిమాల నిర్మాత విజయ్ కిరగందూర్ సలార్‌ను నిర్మిస్తోన్నారు. సలార్‌తో పాటుగా ప్రస్తుతం ప్రాజెక్ట్ – కే, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్నారు ప్రభాస్‌. మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ షూటింగ్ పూర్తయింది. జూన్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !