మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 16: మణుగూరు దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం మణుగూరు, అశ్వాపురం మండలాల్లో దుప్పట్ల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ అధినేత గంటా రాధా చేతుల మీదుగా కమలాపురం, రాయి గూడెం, పాములు పెళ్లి, బట్ట మల్లయ్య వారి గుంపు, బట్టీల గుంపు, కళ్యాణపురం, అన్నారం గ్రామాల్లోని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దానధర్మ ట్రస్ట్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
