మన్యం న్యూస్, భద్రాచలం , జనవరి 21
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆదాయం వివరాలను శనివారం ఆలయ కార్య నిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 23 నుంచి ఈ నెల 12 వరకు ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఘనంగా సాగాయి. ఈనెల 1న తెప్పోత్సవం రెండున ఉత్తర ద్వారా దర్శనం పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31, జనవరి 1, 2 తేదీలలో విక్రయించిన ప్రసాదాలతో పాటు, సెక్టార్ టికెట్లపై వచ్చిన ఆదాయ వివరాలను ఈవో శివాజీ వెల్లడించారు. సెక్టార్స్ రూ. 36 లక్షలు రాగా, ప్రసాదాల ద్వారా రూ. 22.30 లక్షలు ఆదాయం వచ్చినట్లు, మొత్తం 58,30,735/- రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.