మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 23… పత్రిక రంగంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తూ అటు రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్య సమన్వయంగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకున్న మిత్రుడు ఏబీఎన్ రాజకుమారుని కోల్పోవడం ఎంతో బాధాకరమని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సోమవారం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా పత్రిక రంగంలో పనిచేసిన రాజకుమార్ గుండెపోటుతో ఆ కాలం మరణం పొందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఆయన అందించిన సేవలు తోటి పాత్రికేయులకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు అన్నివేళలా సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
