మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న నెల్లూరు శేషుబాబుకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు కనబరిచిన వారికి అందించే పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎస్ పి వినీత్. జి చేతుల మీదుగా పాల్వంచ కలెక్టరేట్ లో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శేషుబాబు మాట్లాడుతూ, ఈ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తనపై బాధ్యత మరింత పెరిగిందని, ఈ అవార్డు నాకు రావడానికి కారణమైన, అంకితభావంతో తమ సేవలను అందించిన అధ్యాపకులకు, ఇష్టపడి చదివి మంచి ఫలితాలు తీసుకొచ్చిన విద్యార్థులకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.