–
మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి26: మైనార్టీల కోసమే ప్రభుత్వం నూతనంగా ఖాజీ కార్యాలయాన్ని మంజూరు చేసిందని జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ స్పష్టం చేశాడు. గురువారం చండ్రుగొండ గ్రామంలో నూతనంగా మంజూరైనా ఖాజీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఖాజీ భాద్యతలను
మహ్మద్ షబ్బీర్ కు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తక్కువగా రూ.1000లకే ముస్లీం మైనార్టీలకు పెళ్లి రిజిస్ట్రేషన్ క చేయబడతాయన్నారు. ఇకపై కొత్తగూడెం ఇతర పట్టణాలకు వెళ్లకుండా ఇక్కడే పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. అనంతరం నూతనంగా ఖాజీ బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ ను పలు సంస్థలు, పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు(దారాబాబు), సీనియర్ నాయకులు మేడా మెహన్ రావు, నల్లమోతు వెంకటనారాయణ, భూపతి శ్రీనివాసరావు, సత్తి నాగేశ్వరరావు, మైనార్టీ సంఘం సభ్యులు బాబా,మౌలాలి, వసీం, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.