మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి26: మండల వ్యాప్తంగా గణతంత్రి దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించారు. గురువారం మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ వర్సా రవికుమార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ అన్నపూర్ణ, పోలీస్ స్టేషన్లో ఎస్సై విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధాన సెంటర్లో బిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి, పార్టీలు గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి,వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యానారయణ, జిల్లా రైతుబంధు సమతి అద్యక్షులు అంకిరెడ్డి క్రిష్ణారెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా బాబు, ప్రధాన కార్యదర్సి ఉప్పతల ఏడుకొండలు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, గానుగపాడు సోసైటి చైర్మన్ చెవుల చందర్రావు, గుంపెన సోసైటి వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.