మన్యం న్యూస్: జూలూరుపాడు, జనవరి 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేసి, ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం పోరాడి, తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం అర్పించిన, త్యాగదనులు, మహనీయుల చిత్రపటాలకు అంజలి ఘటించారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసం రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి పౌరుడు మానవత్వాన్ని, సమానత్వాన్ని, మంచిని అలవర్చుకోవాలని యువతకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయాలతో పాటు, వివిధ పార్టీ కార్యాలయాలు, అనుబంధ సంఘాలు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడంతో, మండల వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.