UPDATES  

 మహనీయుల త్యాగాలను స్పందించుకుందాం భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులే పునాదులు బిఆర్ఎస్ కార్యాలయంలో ఎగిరిన మువ్వన్నెల జెండా

మహనీయుల త్యాగాలను స్పందించుకుందాం
భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులే పునాదులు
బిఆర్ఎస్ కార్యాలయంలో ఎగిరిన మువ్వన్నెల జెండా
జాతీయ జెండాను ఆవిష్కరించిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 26 … దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించుకోవడంలో అమరులైన మహనీయుల త్యాగాలను స్పందించుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడు పై ఉందని భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు పునాదులుగా నిలిచిపోతాయని బిఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పెనుపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. 54వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలిత ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద నుంచి పెద్ద ఎత్తున రేగ యువసేన ఆధ్వర్యంలో పోతురాజు రవి సారధ్యంలో 200 బైకులు సుమారు 40 కార్లతో ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. తొలిత పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం నందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఫలితంగానే నేడు వెనుకబడిన వర్గాల వారు చట్టసభలలో, రాజకీయాలలో, ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి చేరగలుగుతున్నారని అన్నారు, భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య భారతదేశం ఒకే తాటిపై నిలిచిందంటే అది రాజ్యాంగం వల్లే సాధ్యమైందని తెలిపారు, భారత ప్రజల ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో సమానత్వ లభించేలా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేలా ఆనాడు భారత రాజ్యాంగ కర్త అంబేద్కర్ సారథ్యంలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రెండు సంవత్సరాల 11 నెల 18 రోజులు కష్టపడి పూర్తిస్థాయి రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రజలకు రక్షణ కవచాలుగా మార్చారన్నారు, భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులే పునాదులు అన్నారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలు పరిచిన తర్వాత స్వాతంత్ర భారతదేశ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అవతరించిందని దీంతో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని వివరించారు, భారత ప్రభుత్వం నిర్మాణం ఎలా ఉండాలి పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగ నిర్దేశించిందని చెప్పారు, శాసన వ్యవస్థ కార్యాలయం వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఏర్పాటు ఆయా వ్యవస్థల అధికారులు బాధ్యతలు వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా రాజ్యాంగం నిర్దేశించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ చుంచుపల్లి మండల ఎంపీపీ బాదావత్ శాంతి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రజా ప్రతినిధులు, మైనార్టీ విభాగపు జిల్లా అధ్యక్షులు ఎస్కే అన్వర్ పాషా నాయకులు, మోరే భాస్కర్, యూసుఫ్ , రావి రాంబాబు, కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !