మన్యంన్యూస్.ములకలపల్లి.ఫిబ్రవరీ03… గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులను వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలని ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం మాదారం గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశం లొ జెడ్పిటిసి నాగమణి మాట్లాడుతూ గ్రామ పంచాయితీ లొ సర్పంచులు గ్రామాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో చాలామంది సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యయత్నం చేసుకుంటున్నారని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధి లొ భాగంగా, గ్రామం లోని రోడ్లు శుభ్రం చేసి, చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్ల కు చెల్లించాల్సిన నెలసరి వాయిదాలను కట్టలేని పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు అని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులకు నెలనెలా జీతాలు ( గౌరవ వేతనం)కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని,మండల స్థాయిలోని స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా గౌరవ వేతనాలు రెండు నెలలకు గాని మూడు నెలలకు గాని ఒకసారి ఇస్తున్నారని ఆరోపించారు.ఇటీవలే గ్రామ అభివృద్ధి ముఖ్యమని నిజామాబాద్ జిల్లా నందిపేట సర్పంచ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు బిల్లులు మంజూరు చేయక,అప్పులను తట్టుకోలేక, ప్రభుత్వం నుండి రావలిసిన పంచాయితీ బిల్లులు రాక ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించారని తెలియజేసారు.తక్షణమే సర్పంచులు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ సమావేశం లొ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు ఎండి అంజు మ్,మండల కాంగ్రెస్ పార్టీ ఓబిసి అధ్యక్షుడు పుష్పాల హనుమంతు,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ కే ఖాదర్ బాబా,బూరుగుపల్లి పద్మశ్రీ మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.