మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 03.. గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు ఎలాంటి సీజనల్ వ్యాధులు తలెత్తకుండా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డ్రై డే ఫ్రైడే ను సమర్ధవంతంగా నిర్వహించాలని జెడ్పి సీఈఓ మేరుగు విద్యాలత అధికారులను సూచించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో వివిధ గ్రామపంచాయతీలో ఫ్రైడే ను పురస్కరించుకొని చేపడుతున్న పనులను ఆమె పరిశీలించారు. చుంచుపల్లి మండలంలో నందా తండా , చుంచుపల్లి తండా ,బాబు క్యాంప్, వెంకటేశ్వర కాలనీ విద్యానగర్ కాలనీ , ప్రశాంతి నగర్ లోని గరిమెళ్ళపాడు లోని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెంట్రల్ నర్సరీ లక్ష మొక్కల అంచనాలతో ప్రశాంతినగర్ గ్రామపంచాయతీలో నిర్మించబడుతున్న మెగా నర్సరీని సందర్శించి పలు సూచనలు చేసినారు . మండలంలోనీ అన్ని నర్సరీలను బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తి అయిన వెంటనే విత్తనాలను నాటి, మొక్కలు వచ్చు విధంగా చర్యలు చేపట్టాలని, పంచాయతీ కార్యదర్శులకు తెలిపారు ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడేను నిర్వహించి , సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామస్తులను చైతన్య పరచాలని, వాటర్ ట్యాంకులను శుభ్రపరచాలని, అవెన్యూ, డివైడర్ ప్లాంటేషన్ల కు తప్పనిసరిగా నీరు పట్టాలని , తద్వారా మొక్కలు సంరక్షించబడాలని చెట్లకు పాదులు, సపోర్టింగ్ కర్రలు , పిచ్చి మొక్కలు తొలగింపు ద్వారా ప్లాంట్ కేర్ యాక్టివిటీస్ లను పర్యవేక్షించాలన్నారు . మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ హాబిటేషన్లో తెలంగాణ క్రీడా ప్రాంగణంలనూ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన అన్ని పనులను తక్షణం పూర్తి చేయాలన్నారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీలో ఉదయం పూట ఇంటింటికి చెత్త సేకరణ సమయంలో, ఇంటి యజమానులు తడి చెత్త – పొడి చెత్త వేరుచేసి ట్రాక్టర్కు ఏర్పాటు చేసిన పార్టీషన్ నందు వేరువేరుగా చెత్తని ట్రాక్టర్ లో వేయాలని గ్రామస్తులకు తెలియజేయాలన్నారు. . అన్ని డంపింగ్ షెడ్లలో విధిగా సెగ్రిరిగేషన్ జరగాలని అన్ని స్మశాన వాటికలను వాడుకలోనికి తేవాలని అందుకు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అన్ని గ్రామపంచాయతీలలో ఇంకుడు గుంతలు , రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ మిగిలి ఉన్న (ఐ హెచ్ హెచ్ ఎల్ ) వ్యక్తిగత మరుగుదొడ్లు అన్ని తక్షణం పూర్తి చేయాలని , మిగిలి ఉన్న ఓడిఎఫ్ గ్రామపంచాయతీలలో తక్షణం తనిఖీలు నిర్వహించి పనులు పూర్తి చేయలన్నారు.. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సకినాల రమేష్ , ఎంపీ ఓ గుంటి సత్యనారాయణ , ఏ పీ ఓ రఘుపతి , ఈసీ నాగరాజు , టి ఏ లు ఆస్మా , అనిల్ పంచాయతీ కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు.