ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం….
మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 04: మండలంలోని ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్లో శనివారం అశ్వాపురం మండలం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ అరుణ
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులను పరీక్షించి ఆయుర్వేద మందులు అందజేశారు. అనంతరం విద్యార్ధులకు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఆయుష్ ఆరోగ్య కరదీపిక లు అందించి ఆయుర్వేద జీవన శైలి, ఔషధాల విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
