మన్యం న్యూస్ దుమ్ముగూడెం, ఫిబ్రవరి 13…
మండలంలోని రేగుబల్లి గ్రామంలోని గోదావరి నది నుంచి ఇసుక రిచ్ గడువు తీరినప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా గత కొద్ది రోజుల నుంచి రాత్రిపూట అక్రమంగా భారీ వాహనాలతో ఇసుక తరలిస్తూ ఉండగా గత కొద్ది రోజుల క్రితం ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను లోడు చేస్తున్న ప్రోక్లైన్లను పట్టుకున్నారు. ఈ పట్టుకున్న వాహనాల తాళాలను సంబంధిత తాసిల్దార్ కార్యాలయ అధికారులకు అప్పగించగా దుమ్ముగూడెం తహసిల్దార్ చంద్రశేఖర్ సోమవారం పంచనామా నిర్వహించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని నిర్ధారించి ఇసుక తరలిస్తున్న వాహనాల లోడ్ చేస్తున్న భారీ యంత్రాల యజమానులకు రూ. 30వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక భారీ యంత్రాలతో లోడింగ్ చేసి బయటకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.