మరో వివాదంలో.. వనమా ఫ్యామిలీ
వైరల్ అవుతున్న వనమా రాఘవ ఆడియో
ఈసారి ముఖ్యమంత్రి పర్యటనే వేదిక
రూ. 3 లక్షల వసూలు ఆడియో టేపు బయటకు
పార్టీ నుండి బహిష్కరించినా.. అదే పంథా
ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన పిఏ
మన్యంన్యూస్ ప్రతినిధి, కొత్తగూడెం :
కొత్తగూడెం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రత్యర్థుల అవకాశం, ఎమ్మెల్యే దురదృష్టమో గాని ప్రత్యర్థుల చేతికి తరచూ అస్త్రాలు దొరుకుతున్నాయి. దీంతో రాజకీయంగా ఎమ్మెల్యే వనమాపై ఆయన కుటుంబం పై దాడికి మంచి అవకాశాలు లభించడంతో అటు మీడియా,ఇటు వైరి వర్గాలు ఎవరూ వదిలిపెట్టడం.లేదు.
తాజాగా మంగళవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు , టిఆర్ఎస్ బహిష్కృత నేత వనమా రాఘవేంద్రరావు, పిఎ రిషి కి మధ్య జరిగిన ఆడియో సంభాషణ వైరల్ గా మారింది. మంగళవారం సాయంత్రం ఈ విషయమై ఓ చానల్లో వార్త రావడంతో నియోజకవర్గం అంతా ఒకసారిగా అవాక్కయింది.ఈ ఆడియోలో వసూళ్ల పర్వం గురించి,సీఎం పర్యటనకు ఆయన ఖర్చు గురించి సవివరంగా ఉండడంతో అవాక్కవడం విన్న జనం వంతైంది. కొత్తగూడెం సబ్ రిజిస్టార్, మరో టిఆర్ఎస్ నాయకుడు కాంపెల్లి కనకేష్ కేంద్రంగా ఆడియో సంభాషణ అంతా కొనసాగింది. కొత్తగూడెం సబ్ రిజిస్టార్ కొత్తగూడెం ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్లి రూ. మూడు లక్షలు ముట్ట చెప్పినట్టు,ఇదంతా సీఎం కెసిఆర్ పర్యటన కోసం చేసిన ఖర్చు రాబట్టుకునేందుకు చేసిన వసూలుగా అర్థమవుతుంది.
సీఎం పర్యటనకు 70 లక్షలు ఖర్చు పెట్టామని, ఈ బోడి మూడు లక్షలు తీసుకోకుండా ఉండే వాళ్ళమని ఈ మూడు లక్షలు రిజిస్టార్ ఇవ్వడం వల్ల ప్రత్యర్థి కి అవకాశం దొరికినట్టు అయిందని, వనమా తనయుడు రాఘవేందర్రావు ఆడియో లో వాపోతున్నారు. కాంపెల్లి కనష్ అనే వ్యక్తి,పీఏ రిషితో మాట్లాడి రిజిస్టర్ వస్తాడు అన్న తో కలుపు, వాళ్ళు మాట్లాడుకుంటారని చెప్పాడని, అందువల్లే తాను కల్పించానని పీఏ ఋషి ఆడియోలో వివరణ ఇస్తున్నారు. అయితే కనకేష్ కలపమన్నాడు అన్న విషయం తనకు ఎందుకు చెప్పలేదని, ఆ విషయం తనకు తెలిసి ఉంటే రిజిస్టార్ వద్ద తీసుకోకుండా ఉండేవాళ్ళమని,తండ్రి, తనయుడు,కుటుంబ సభ్యులు చెప్పడం ఆడియోలో సంచలనంగా మారింది. రూ 3 లక్షలు తీసుకున్నందుకు కాదు గానీ,ప్రత్యర్థికి ఈ విషయం తెలియడంతో వనమా కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు ఆడియో సంభాషణను బట్టి అర్థమవుతుంది. ఎన్ని లక్షలు ఖర్చుపెట్టి ఆ బోడి 3 లక్షల కోసం తాను బదనాం కావడం ఏమిటంటూ మనమా రాఘవ ఆడియోలో చెప్పడం విశేషం.ఇలా ఆడియో ఆద్యంతం పలు విషయాలను కళ్ళ కట్టినట్టు వెల్లడించింది ఈ ఆడియో ఎలా రికార్డు అయింది. ఎలా బయటికి వచ్చింది అనేది సశేషంగా ఉంది.ఇలాంటి ఆడియోలు మరికొన్ని కూడా వెళ్లడయ్యే ప్రమాదం ఉన్నట్టు వినబడుస్తుంది.మరికొందరు అధికారుల వద్ద కూడా ఇలా డబ్బులు తీసుకున్న విషయంలో సంభాషణలు రికార్డు అయినట్టు సమాచారం. ఓ ఇరిగేషన్ అధికారి సైతం వనమా రాఘవేంద్రరావుకు ఎమ్మెల్యేకు మధ్య జరిగిన సంభాషణ బయటికి లీక్ అయిందన్న కారణంగా, వనమా అనధికారిక పిఎ రిషి పై వనమా రాఘవేంద్రరావు గతం లో దాడికి దిగిన విషయం విధితమే.కాగా జీతం విషయం కోసం జరిగిన గొడవగా కొందరు ఈ కథనానికి కలర్ ఇచ్చారు. అయినప్పటికీ ఏ విషయమై గొడవ జరిగిందో మొత్తం బయటికి వెళ్ళడైంది.దీంతో సదర్ పిఏ వల్ల నే ఇవన్నీ బయటపెడుతున్నాడు,అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో ఇంకా ఇక్కడ పనిచేయడం మంచి కాదు అన్న ఉద్దేశంతో సదర్ పిఏ వనమా వద్ద పని మానేసినట్టు సమాచారం.
కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభానికి సీఎం వచ్చి వెళ్లిన అనంతరం ఈ గొడవ జరిగినట్టు సంభాషణ జరిగినట్టు సమాచారం. కాగా ఇది దాదాపు సీఎం పర్యటన ముగిసిన నెలరోజుల తర్వాత ఈ విషయం బయటికి రావడం విశేషం.
పార్టీ నుండి వనమా రాఘవ సస్పెండ్
కాగా పాల్వంచలో మండిగ రామకృష్ణ భార్య ఇద్దరు పిల్లలు ఆత్మహత్య ఉదంతం లో టీఆర్ఎస్ పార్టీ నుండి వనమా రాఘవను సస్పెండ్ చేశారు. కొంతకాలం పాటు ఆయన రిమాండ్ లో ఉండి కండిషన్ బెయిల్ పై విడుదలయ్యారు. రాజకీయ టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో రాఘవేంద్రరావు పాల్గొంటున్నారు.సీఎం పర్యటన పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నిర్వహించాలని వనమా రాఘవేంద్రరావు సోమవారం సైతం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారని సమాచారం.ఇందులో చైర్పర్సన్,ఇతర నాయకులు,కౌన్సిలర్లు తదితరులు పాల్గొనడం విశేషం.వనమా రాఘవేంద్రరావు నాయకత్వంలో క్యాంపు కార్యాలయం కేంద్రంగా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.