మన్యం న్యూస్.దమ్మపేట. ఫిబ్రవరి 17…గుండెపట్వారిగుడెం గ్రామానికి రూ.25లక్షల రుపాయల నిధులు మంజూరు చేయించి,సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు శుక్రవారం శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో ప్రజల కష్టాలు తీరుస్తూ,నియోజకవర్గ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, నియోజకవర్గంలో ప్రజల ప్రయాణం సౌకర్యార్థం,ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని,ఇప్పటికే అనేక చోట్ల సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయించి,రోడ్లు పోయించడం జరిగిందని,మిగిలిన రోడ్లకు కూడా త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని,ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ నియోజకవర్గానికి అండగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, దొడ్డకుల రాజేశ్వరరావు,పంచాయతీ శాఖ అధికారి శ్రీధర్,ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, కుకలకుంట రమేష్,సర్పంచ్ చంటి,గ్రామ పెద్దలు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
