మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 20…
పినపాక గ్రామానికి చెందిన జిమ్మిడి రాకేష్, అనీవేష్ సోదరులు గ్రంథాలయానికి కంప్యూటర్స్ ను సోమవారం వితరణగా అందజేశారు. గ్రంథాలయానికి సంబంధించిన సమాచారం కోసం కంప్యూటర్స్ ను ఇవ్వడం జరిగిందని సోదరులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రంధాలయానికి మేము ఎంతగానో రుణపడి ఉన్నామని, గ్రంధాలయంలో చదువుకున్న చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు. గ్రంథాలయ ఇన్చార్జి బింగి గీత మాట్లాడుతూ, కంప్యూటర్స్ అందజేసిన జిమ్మిడి సోదరులు మంచి ఆలోచనతో, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.