ఐడిఓసి కార్యాలయంలో ఇకనుంచి బయోమెట్రిక్ హాజరు అమలు
ప్రజావాణిలో దరఖాస్తుకు జవాబుదారీగా ఉండండి.. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ .
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో ఇకనుంచి బయోమెట్రిక్ హాజరు అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం ఐ డి ఓ సి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి
సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ మేరకు పాల్వంచ, మణుగూరు మున్సిపాల్టీలలో చేపట్టనున్న పనులపై ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. పాల్వంచలోని చింతలచెర్వును
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు కార్యాచరణలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చింతలచెర్వు బ్యూటిఫుల్ పిక్నిక్ స్పాట్ కావాలని, పాల్వంచకు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తయారు చేయుటకు
ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కార స్వభావాన్ని పోర్టల్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు..
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు కొన్ని…
పాల్వంచ మండలం, రంగాపురం గ్రామపంచాయతీకి చెందిన బానోత్ బోజ్య రంగాపురం రెవిన్యూ నందు సర్వే నెం. 3/1లో 4 ఎకరాల భూమి ఉన్నదని, వారసత్వంగా అట్టి భూమిని తన కుమారుడు బానోత్ వలమాకు వాటాగాఇచ్చియున్నానని, ఆ భూమిని అతని పేరుమీదకు మార్చి సర్వహక్కులు కల్పించడంతో పాటు రైతుబంధు వచ్చే విధంగా
చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన ఆయన తగు చర్యలు నిమిత్తం ధరణి కో ఆర్డినేటర్కు ఎండార్స్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన టి నాగేశ్వరి పాల్వంచలోని కెఎస్ఆర్ కళాశాలలో ఫార్మా డిలో ఉచిత సీట్ వచ్చిందని, తదుపరి జరిగిన కౌన్సిలింగ్లో తనకు యంఎస్ఆర్ వైద్య కళాశాలలో బిహెచ్ఎంఎస్లో సీటు వచ్చిందని, ఒరిజనల్ సర్టిఫికేట్లు కావాలని కెఎస్ఆర్ కళాశాలలో దరఖాస్తు చేయగా లక్షా 50 వేల రూపాయలు చెల్లించాలని చెప్తున్నారని, నిరుపేద కుటుంబానికి చెందిన తాను అంత ఫీజు చెల్లించే స్థితిలో లేనని, తన ఒరిజనల్
సర్టిఫికేట్లు ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన ఆయన తగు చర్యలు నిమిత్తం పాల్వంచ తహసిల్దార్కుఎండార్స్ చేశారు.
చండ్రుగొండ మండలం, తిప్పనపల్లి గ్రామానికి చెందిన కళ్లెం అనంతరాములు 10 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్నానని, తనకు తెల్ల రేషన్కార్డు ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు
నిమిత్తం జిల్లా పౌర సరఫరాల అధికారికి ఎండార్స్ చేశారు.
మణుగూరు మున్సిపాల్టీ, ఆదర్శనగర్కు చెందిన తమ్మిశెట్టి దుర్గ సిసి రేకులతో ఇల్లనిర్మించుకున్నామని, అట్టి ఇంటికి ఇంటి నెంబర్ కేటాయించాలని మున్సిపాల్టీలో దరఖాస్తు చేశామని, ఇంతవరకు ఇంటినెంబర్ కేటాయించలేదని, తనకు ఇంటినెంబర్ కేటాయించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం మున్సిపల్
కమిషనర్కు ఎండార్స్ చేశారు.
అశ్వారావుపేట మండలం, గ్రామానికి చెందిన మంపాటి రవి అశ్వారావుపేట రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 911లో 4 ఎకరాలు సాగు చేస్తున్నానని, అట్టి భూమికి పట్టా మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం
ఆర్ఎఎస్ఆర్ డిటి, భద్రాచలంనకు ఎండార్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.