మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 20
మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన కొమరం నరసింహారావు ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. గతంలో ఆయన పినపాక మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం పంచాయతీలో విఆర్వోగా విధులు నిర్వహించారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ గా చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం నాడు తనకు గల వ్యవసాయ పొలం దగ్గరకు వెళ్ళగా, అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం ఆయన నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పినపాక మండల ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు