మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 19, రాష్ట్రంలో గత ఐదు రోజులుగా అకాల వర్షాలు బీభత్సవం సృష్టించడంతో చేతికందిన పంటలు మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడిందని, వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షం కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని మిర్చి కళ్ళలను బిజెపి కిసాన్ మోర్చా నాయకులు ఆదివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి నున్న రమేష్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాదు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మోతుకూరి నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిరిపురపు పుల్లారావు, గోపాల్ రావు, సత్యనారాయణ, వందనపు సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.
