UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 భక్తులకు సకల సౌకర్యాలను కల్పించండి.. అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్..

భక్తులకు సకల సౌకర్యాలను కల్పించండి

అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 18… శ్రీరామనవమి మహాపట్టాభిషేకం మహోత్సవాలు వీక్షణకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సకల సౌకర్యాలను కల్పించాలని కేటాయించిన విధులను పక్కడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి, మహా పట్టాభిషేక కార్యక్రమాల నిర్వహణపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ వేడుకల నిర్వహించు మండపాన్ని 26 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టారులో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు వీక్షించేందుకు పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలిపారు. భక్తులు ఒక సెక్టార్ నుంచి ఒక సెక్టార్ కు వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. భక్తుల వసతి (లాడ్జి) లను ఆన్లైన్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయాలు చేపట్టాలని, ఇప్పటి వరకు 2500 టికెట్లు విక్రయించి నట్లు తెలిపారు. మహోత్సవ విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. మహోత్సవాల రోజుల్లో మాంసం, మద్యం విక్రయాలను నిలిపి వేయించాలి సంబంధిత అధికారులను ఆదేశించారు. సెక్టార్లో విధుల నిర్వహణకు ప్రత్యేక పారిశుద్ద్య సిబ్బందిని నియమించాలని డిపిఓ కు సూచించారు. పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షణకు 25 జోన్లుగా విభజించి, ప్రతి జోనుకు ఒక ఎంపీవో తో పాటు నలుగురు కార్యదర్శులు నియమించామన్నరు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08743- 232444 నంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంచినీటి సరఫరాకు పట్టణంలో 200 మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంచినీటి సరఫరా పర్యవేక్షణకు 30 మంది ఏఈలు, మంచినీటి పరీక్షలు నిర్వహణకు 12 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. ప్రతి సెక్టార్ కు మంచినీటి సరఫరాకు ఏఈలను నియమించాలని మిషన్ భగీరథ ఈ ఈ ని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు నివారణకు అగ్నిమాపక వాహనాలను, ఎస్టింగ్విష్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని అగ్నిమాపక అధికారిని ఆదేశించారు. రెస్క్యూ టీములను అందుబాటులో ఉంచుకోవాలని అగ్నిమాపక అధికారులకు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు పట్టిస్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. భక్తులు వాహనాలు పార్కింగ్ కొరకు 5 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. పార్కింగ్ ప్రాంతాల్లోనే భక్తులు వాహనాలు నిలుపుదల చేయు విధానం చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట భారికేడింగ్ ఏర్పాటుతో పాటు నాటు పడవలను, గజ ఈతగాళ్లను సిద్డంగా ఉంచాలన్నారు.. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరికలు బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. స్వామివారు కళ్యాణ మండపానికి విచ్చేయుచున్నప్పుడు భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచల భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులు అధికారులకు సూచించారు. వంతెనపై వాహనాలు ఆగిపోతే తక్షణమే తరలించేందుకు వీలుగా క్రేన్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. 24 గంటలు పని చేయు విధంగా అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 20 బెడ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఐసియు వార్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, ఎర్పాట్లు పరిశీలించి విద్యుత్ అధికారులు దృవీకరణ నివేదిక అందచేయాలని చెప్పారు. చిన్నారులు తప్పిపోయిన సందర్భంలో గుర్తించడానికి వీలుగా జేబులో చిరునామాతో పాటు సెల్ ఫోన్ నెంబర్లను పెట్టాలని ఆయన భక్తులకు సూచించారు. హోటల్ యజమానులు ఆహార పదార్థాలకు నిర్ణీత ధరలను నిర్దేశించాలని, ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారిని ఆదేశించారు. హోటల్లో రూములు ఖాళీలు, ఆక్రమణ పై ఎప్పటికప్పుడు పరిశీలన చేసి నివేదికలు అందజేయాలని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం తలంబ్రాలు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా 70 కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. భద్రాచలం విచ్చేసిన ప్రతి భక్తునికి తలంబ్రాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన దేవస్థానం అధికారులకు సూచించారు. భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిపిఆర్ఓను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ పరితోష్ పంకజ్, దేవస్థానం ఈవో రమాదేవి, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి ఆర్డిఓ రత్న కళ్యాణి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !