మన్యంన్యూస్,ఇల్లందు: మార్చి 20 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించేందుకు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన పార్టీ జిల్లా ఇన్చార్జ్ టి. భాను ప్రసాద్ రావును , భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావును సమావేశం అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ, ఇల్లందు పురపాలక ఛైర్మెన్ డీవీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్లు సయ్యద్ ఆజం, వార రవి, మాజీ కౌన్సిలర్ ఎలమందల వాసు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్ర ఈశ్వర్ ఉన్నారు.
