UPDATES  

 అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.—: యెర్రా కామేష్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..

సుజాతనగర్: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మండల పరిధిలోని నిమ్మలగూడెం గ్రామంలో వర్షానికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని.ఓవైపు రైతుల పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయని ప్రభుత్వాల నుండి సహాయం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.పొట్టదశలో ఉన్న వరి సహా కోసి ఆరబెట్టిన పంటలు ద్వంసం అవుతుండడంతో ఆరుగాలం రైతు పడిన శ్రమ వృధా అయిందని,పంట నష్టంపై ప్రభుత్వం నుంచి గానీ,వ్యవసాయ విభాగం నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుందన్నారు.గతంలో ఇలాంటి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేయించి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకునేదన్నారు.ప్రకృతి విపత్తులు,భారీ వర్షాలతో పంటలు కుదేలవుతుంటే వారిని ఆదుకునే పథకం ఏదీ కూడా ప్రభుత్వం వద్ద లేకపోవడం అత్యంత దారుణమన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో *రైతు తుంపురి శివ,ఉప్పర్ల హుస్సేన్,ఉబ్బెన వెంకటరమణ,సాయి,ఆట శ్రీకాంత్,నిరంజన్ కుమార్* తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !