మన్యం న్యూస్, మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమలాపురం గ్రామంలోని ఇందిరా కాలనీలో ఎన్ఆర్ఇజిఎస్ నిధుల ద్వారా మంజూరు అయిన సీసీ రోడ్ నిర్మాణం పనులను మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు పచ్చ శేషగిరిరావు, మంగపేట మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి ముఖ్య అతిధులుగా*విచ్చేసి సీసీ రోడ్ నిర్మాణం పనులు ప్రారంభించి, తెలంగాణా ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి పథకాలు ఇందిరా కాలనీ వాసులకు తెలియజేసారు
ఈ కార్యక్రమం లో మంగపేట ఆర్గనైజషన్ సెక్రటరీ చల్లగురుగుగుల తిరుపతి, సీనియర్ నాయకులు పబ్బోజు సత్యనారాయణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.