మన్యం న్యూస్ గుండాల.. కన్నుల పండుగగా మండలంలో రాములోరి కళ్యాణాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు మండలం పరిధిలోని పాల్గొని గూడెం గ్రామంలో సీతారాముల కల్యాణానికి అశేష దినవహిని హాజరయ్యారు. మండల కేంద్రంలో మానాల నారాయణమూర్తి వారి కుమారుల ఆధ్వర్యంలో రాములవారి సీతమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలను శోభాయాత్రగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలి గుండా నిర్వహించి అనంతరం రాములోరి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మానాల వెంకటేశ్వర్లు, తిరుకల్లూరి వెంకన్న, ఇల్లందుల అప్పారావు, ఇల్లందుల నరసింహులు, యాసారపు రవి, యసారపు సురేష్ , తవ్డోజి సురేష్, మానాల సతీష్ కుమార్,అనాల శ్రవణ్ కుమార్, వల్లజి ప్రభాకర్,వల్లోజి సాగర్, మానాల ప్రణీత్ కుమార్, శ్రీశైలం, వీరన్న, శ్రీను, తదితరులు పాల్గొన్నారు